వాజేడు – తెలంగాణ ములుగు జిల్లా వాజేడు మండల సరిహద్దు రాష్ట్రమైన చతిస్గడ్ లోని అంబుజమడ్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టు మృతి చెందారు. ఈ కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు.ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నారాయణపూర్ కాంకేర్ దంతేవాడ కొండగావ్ జిల్లాలకు చెందిన జవాన్లు సంయుక్త ఆపరేషన్ లో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు సమాచారం. సరిహద్దు రాష్ట్రంలో ఎన్ కౌంటర్ జరగడంతో ఈ ప్రాంత పోలీస్ అప్రమత్తమై రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జాయింట్ ఆపరేషన్‌లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ 53వ బెటాలియన్ ఫోర్స్‌లు జాయింట్‌గా పాల్గొన్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement