Monday, September 16, 2024

TG: ఇండస్ట్రీస్ తో భూపాలపల్లి యువతకు ఉద్యోగావకాశాలు.. మంత్రి సీతక్క

ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది
ఈనెల చివరి వరకు 4.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు
రెవెన్యూ శాఖ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మైలారం గుట్టపై ఇండస్ట్రీయల్ పార్క్ కు శంకుస్థాపన
ప్రజల ఇచ్చిన వాగ్దానాలను కట్టుబడి ప్రభుత్వం ఉంది.. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
బాధ్యత ఎక్కడ విస్మరించలేదు


ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి /గణపురం, (ప్రభ న్యూస్): ఉద్యోగాల వేటలో చాలా మంది ప్రజలు, నిరుద్యోగులు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, దనసరి అనసూయ సీతక్క, వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్యలు అన్నారు. శనివారం భూపాలపల్లి పర్యటనకు వచ్చిన మంత్రులు ముందుగా జయశంకర్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్ మైలారం గుట్టపై 50 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూపాలపల్లి, వర్ధన్నపేట శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, కే ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరేతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో మంత్రులు మాట్లాడారు.

ఇండస్ట్రియల్ పార్క్ తో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు.. మంత్రి సీతక్క
భూపాలపల్లికి ఇండస్ట్రియల్ పార్క్ రావడంతో భూపాలపల్లి యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. ములుగులో కూడా ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఉద్యోగం కోసం తెలంగాణ ఉద్యమం అని చెప్పి గత బీ.ఆర్.ఎస్ పది సంవత్సరాలుగా ఒక్క నోటిఫికేన్ ఇవ్వలేదన్నారు. ధరణి తెచ్చి ఎందరినో ఇబ్బందులు పెట్టారని, సీఎం రేవంత్ రెడ్డి భూమాతను భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్నారన్నారు. జాబ్ క్యాలెండర్ తెచ్చామన్నారు స్కిల్ ఇండియా ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రుణ మాఫీ జరిగిందన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓకే సారి రెండు లక్షల రుణ మాఫీ చేశామన్నారు. భూపాలపల్లి అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని, వెనుక బడ్డ ప్రాంతాల అభివృద్దే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని మంత్రి సీతక్క తెలిపారు.

- Advertisement -

ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ప్రజల దీవెనలతో రేవంత్ రెడ్ది నాయకత్వంలో తెలంగాణ లో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అన్నారు. అభివృద్ది, సంక్షేమం రెండు రెండు కళ్ల లాగ జోడెడ్ల లాగా సాగుతున్నాయన్నారు. పేదోడి ఆలోచనకు అనుగుణంగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కాబోతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను తూచా తప్పకుండా అమలుచేస్తూ ఇందిరమ్మ రాజ్యం చెప్పిన మాట ప్రకారం రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటకు ఇన్షు రెన్స్,విత్తనాలకు సబ్సిడీ ఇస్తూ రైతులను రాజులు గా చేస్తుందన్నారు. శాసన సభ్యులు కోరిన విధంగా భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తాం అన్నారు.

ఈనెల చివరి వరకు 4.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు యుద్ధ ప్రాతిపదికన ప్రతి గ్రామానికి ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇదిగో అదిగో అని మాయ మాటలు చెప్పి 10 సంవత్సరాలలో కేవలం 1.50 లక్షల ఇల్లు మాత్రమే కట్టిందని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం మొదటి విడత లోన్ 4.50 లక్షల ఇళ్లు కట్టిస్తుందన్నారు. ప్రజల దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వంపై మీ ప్రేమాభిమానం ఉండాలన్నారు. శ్రీధర్ బాబు మంచి నిర్ణయం తీసుకొని ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధి చూపించారన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పేరు ఎత్తలేదు.. రాష్ట్రానికి న్యాయంగా రావాలసిన నిధుల గురించి బీజేపీ తొండాట ఆడుతుందన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.

ప్రజల ఇచ్చిన వాగ్దానాలను కట్టుబడి ప్రభుత్వం ఉంది
బాధ్యత ఎక్కడ విస్మరించలేదు
మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు


ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తమ బాధ్యతల్లో భాగంగా ఎక్కడ కూడా విస్మరించకుండా 7 నెలల నుండి ఒక్క అడుగు తరువాత ఒక్క అడుగు వేస్తూ అభివృద్ధి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. భూపాలపల్లి జిల్లాలో నీటి వనరులు, ఖనిజ సంపద ఉంది. భూపాలపల్లి జిల్లాలో రెండు బ్యారేజీల ఉన్నాయి. గత ప్రభుత్వంలో వాటి ద్వారా భూపాలపల్లి, మంథని నియోజకవర్గానికి ఒక్క ఎకరమైనా నీరందించారా అన్నారు. అశాస్త్రీయ బద్ధంగా బ్యారేజి కడితే కుంగిపోవడం మీరందరూ చూశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర చేశారు అని మాట్లాడుతున్నారు. డిసెంబర్ 7 తేదీన ప్రమాణ స్వీకారం చేసి అధికారులను ప్రజల వద్దకు తీసుకెళ్లడం కోసం క్యాబినెట్ ముందుకు సాగింది. 9వ తేదీన మహిళలకు ఉచిత బసు ఏర్పాటు చేశామన్నారు. 63 కోట్ల ప్రయాణాలు మహిళా సోదరి మణులు చేశారు. మంత్రి సీతక్క ,సీఎం రేవంత్ రెడ్డి మహిళలను లక్షలాది కారులను చేస్తా అంటే ప్రతి పక్షాలు నవ్వారు. కోటి మందిని స్వశక్తి మహిళా గ్రూపు సభులు గా చేర్చి మహిళాను లక్షయధికారులు చేయడానికి ప్రణాలికలు రూపొందించారు. శాసన సభ్యులు గండ్ర సత్య నారాయణ రావు ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కష్టపడ్డాడన్నారు.

కలెక్టర్ తో మాట్లాడి భూమి ఏర్పాటు చేసి నన్ను సంప్రదించారన్నారు. ఎమ్మెల్యే సంకల్పం తో మేము శంకుస్థాపన చేసి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. 200 పరిశ్రమలను ఏర్పాటుకు చేస్తాం మొట్టమొదటి పరిశ్రమ శంకుస్థాపన చేస్తామన్నారు. ఐటీ రంగ ఉద్యోగులు కూడా సాఫ్ట్ వేరే కంపెనీలు కావాలని కోరుతున్నారు. ఐటీ నిపుణులతో సంపార్డించి కార్య కారణ చేస్తామన్నారు. సీతక్క,సత్తన్న , నా నియోజక వర్గం ల వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని మేము 6 గ్యరేంటీలు చెప్పినం మేం ముందుకు పోతున్నామన్నారు.ప్రతి నియోజక వర్గం లో ఇందిరమ్మ ఇల్లు త్వరలో ఇవ్వబోతునామన్నారు.రైతులకు 31 వేల కోట్ల రూపాయలు రెండు విడతలలో ఋణ మాఫీ చేసి లక్ష,లక్ష యాభై వేల రూపాయల ఋణ మాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్ట లేదు. ధరణి నీ ప్రక్షాళన చేస్తామని చెప్పం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ప్రక్షాళన చేస్తున్నామన్నారు. నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ రైతులు తిరగకుండా చూస్తామన్నారు.

ప్రతి నియోజక వర్గ కేంద్రంలో మినీ పారిశ్రామిక పార్కు ను ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క కార్యచరణ చేపట్టబోతున్నారు. మహిళల పేరిట, ఈ రాష్ట్రం పేరిట బ్రాండింగ్ ను సైతం ఏర్పాటు చేస్త్యబోతున్నాం. ములుగు, భూపాలపల్లి ప్రాంతానికి సాగు నీటి అవసరాలు తీర్చడానికి ప్రణాళికలు రూపొందిస్తామని అతి త్వరలో ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి డి పి ఆర్ తయరు చేస్తామన్నారు. 35 వేల ఎకరాలకు, గ్యాప్ ఆయకట్టు కు సంబంధించి ఆలోచన చేస్తామన్నారు.రాష్ట్ర యువతకు నైపుణ్యం పెంచడానికి ఒక గొప్ప ఆలోచనలో భాగ్నెగ్ యంగ్ ఇండియా స్కిల్ ఇండస్ట్రీని హైదరాబాదులో ఏర్పాటు చేయబోతున్నాం. మెరుగైన నైపుణ్యాన్ని కల్పించడానికి పనిచేస్తామన్నారు.సింగరేణి, జెన్ కో,పారిశ్రామికంగా ఉన్నది ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని జిల్లాను ,నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుత్తమన్నారు. పోడు భూముల సమస్యలు రాకుండా చూడాలని అటవీ అధికారులకు ,పోలీసులకు న్యాయ పరణగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement