సీఐఐ, ఏఐసీటీఈ, ఏఐయు, ట్యాగ్డ్, సన్‌స్టోన్ ఎడ్యువర్శిటీ, యుఎన్‌డీపీ సహకారంతో వీబాక్స్ తమ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ (ఐఎస్‌ఆర్) 2022 ను విడుదల చేసింది. ప్రతిభావంతుల కోసం డిమాండ్, సరఫరా నడుమ ఉన్న అంతరాలను ఈ నివేదిక వెల్లడిస్తుంది. ఐఎస్‌ఆర్ 2022ప్రకారం మొత్తంమ్మీద 46.2శాతం మంది యువత గత సంవత్సరం ఉపాధి సామర్థ్యం అయిన 45.97శాతంతో పోలిస్తే మరింత మెరుగ్గా ఉపాధి సామర్థ్యం కలిగి ఉన్నారు. వీబాక్స్ ఫౌండర్ అండ్ సీఈఓ నిర్మల్ సింగ్ మాట్లాడుతూ… మహమ్మారి మనకు రిమోట్ అభ్యాసం, రిమోట్ వర్క్ వంటివి పరిచయం చేయడంతో పాటుగా ఐటీ, బిజనెస్ కన్సల్టెన్సీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లలో ఇవి సాధారణతగా మార్చిందన్నారు. మరీ ముఖ్యంగా విద్యా రంగం దీనికి నేతృత్వం వహిస్తుందని అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌లో క్రిటికల్ థింకింగ్, న్యూమరికల్ ఎబిలిటీ రంగాల్లో అపార ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులు సీనియన్ ఎనలిస్ట్, బిగ్ డాటా ఇంజినీరింగ్ బాధ్యతలలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటుగా మెరుగైన అవకాశాలను పొందుతున్నారన్నారు. అందువల్ల, ఉద్యోగార్హత నైపుణ్యాలనేవి విద్యార్ధుల ఉద్యోగ విజయానికి నడుమ ప్రత్యక్ష సంబంధం కలిగిఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital