హైదరాబాద్ – ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల స్థలాల విషయంలో అర్హులైన ఒక్కరికి కూడా అన్యాయం జరుగదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీకి సంబంధించిన భూ సమస్య పెండింగ్‌లో ఉందని, గతంలో వారికి కేటాయించిన భూమి అలాగే ఉందని, ఈ భూమిని ఉద్యోగులకు పంచేందుకు సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
. భాగ్యనగర్ టీఎన్జీఓ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ ఇండ్ల స్థలాల పరిష్కారం కోసం రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టీఎన్జీఓ కేంద్రం సంఘం అధ్యక్షులు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్ ,, టీఎన్జీఓ అసోసియేట్ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ నీ గురువారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ త్వరలోనే ఉద్యోగులకు చెందాల్సిన స్థలాలను వారికి అప్పగించేలా సీఎం కేసీఆర్ తో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
స్వరాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగికి కూడా అన్యాయం జరుగదని, ఇప్పటి వరకు ఫ్రెండ్లీ సర్కారుగా ఉంటున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఇటీవల మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు బీటీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశానికి వచ్చి గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ స్థలం విషయంలో మంత్రి కేటీఆర్ ని కలిసి, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చుకునే ప్రయత్నంలోనే గురువారం మంత్రి కేటీఆర్ ని కలిసి అభినందనలు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్‌కు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.