Saturday, November 23, 2024

తెలంగాణలో ఎవ‌రూ సంతోషంగా లేరు : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు… నిరుద్యోగులు…రైతులు ఎవరు సంతోషంగా లేరని టీపీసీసీ అధ్య‌క్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం అనే సంతృప్తి కూడా లేకుండా సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అతలా కుతలం చేసేలా ఉన్నాయి పాలకుల నిర్ణయాలన్నారు. ఉద్యోగం, ఉపాధ్యాయ నియామకంలో స్థానికత ఉండాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కూడా ఉద్యోగుల వైరుధ్యాల వల్లనే కదా..? అన్నారు. Go. 317 రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధమ‌న్నారు. పాత ఉమ్మడి జిల్లాను ఎన్ని జిల్లాలుగా అయినా విభజించినా పుట్టి పెరిగిన చోట ఉద్యోగం ఇవ్వాలన్నారు.

ఉపాద్యాయులు..ఉద్యోగులు గొంతేమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. విద్యార్ధులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను రోడ్డెక్కేలా చేశారన్నారు. ధర్నాలు చేస్తే… రోడ్లపై ఈడ్చుకొని పోతున్నారన్నారు. జేత్రాల్ నాయక్ సొంత జిల్లాలో ఉంచాలని కోరాడు కానీ ములుగు జిల్లాకు బదిలీ చేశారన్నారు. ఆ బాధ బరించలేక గుండె పోటుతో చనిపోయాడన్నారు. వాళ్ళను పరామర్శించేందుకు వెళ్లాలని చూస్తే నిర్భందం చేశారన్నారు. బాధిత కుటుంబాన్నీ పరామర్శించడం తప్పా.. ఎందుకు మమ్మల్ని అడ్డుకోవడం అని అడిగారు. ప్రభుత్వం తప్పుడు నిర్ణయం వల్ల meo చనిపోతే విద్యా శాఖ మంత్రి పట్టించుకోలేదన్నారు. కనీసం ఆ కుటుంబాన్నైనా పరామర్శించాలి కదా.. ఉద్యోగులు ఆలోచన చేయండి అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సర్కార్ విధానం ఎలా ఉందో.. ఇంటర్ బోర్డు తప్పులకు విద్యార్దులు చనిపోయారన్నారు. తర్వాత అందరికీ కనీస మార్కులు వేసినందుకు పాలాభిషేకం చేయాలంటా.. కేసీఆర్, కేటీఆర్ నీ ఉరి తీసినా తప్పు లేదన్నారు.
నల్గొండ నుండి హైదరాబాద్ వచ్చే వరకు ఎక్కడైనా కేటీఆర్ ని అడ్డుకోండి.. తిక్క రేగితే..జైల్ భరో చేస్తామ‌న్నారు. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తామ‌న్నారు. నూతన సంవత్సరంలో కార్యాచరణే.. జైల్ భరో చేస్తామ‌ని, కేసీఆర్ పోలీసులను ప్రైవేట్ సైన్యంగా మార్చారన్నారు. పోలీసులతో మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నార‌న్నారు. దీనికి నిరసనగా… రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల పర్యటనలు అడ్డుకుంటామ‌న్నారు. కాంగ్రెస్స్ శ్రేణులు, nsui, యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకుందన్నారు.


పార్టీ ఆర్మీగా మారండి…. కేటీఆర్, మంత్రులను అడ్డుకోండి : షబ్బీర్ అలీ పీఏసీ కన్వీనర్
పార్టీ ఆర్మీగా మారి… కేటీఆర్, మంత్రుల‌ను అడ్డుకోవాల‌ని పీఏసీ క‌న్వీన‌ర్ షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు.ఆయ‌న మాట్లాడుతూ.. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ పాలన చేస్తున్నారన్నారు. పోలీసుల్ని పెట్టీ అడ్డుకుందామంటే కుదరదన్నారు. నీ మంత్రులు ఎట్లా తిరుగుతారనేది చూస్తామ‌ని అన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement