Friday, November 22, 2024

నీటిపారుదల శాఖ అధికారిణిపై దాడి అమానుషం – చ‌ర్య‌ల‌కు జాక్ డిమాండ్

నిజామాబాద్ సిటీ, జూన్ ( ప్రభా న్యూస్)26: నిజామాబాద్ జిల్లాలో నీటిపారుదల శాఖ అధికారినిపై దాడి చేయడం అమానుష మని, దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్ కోరారు. నీటిపారుదల శాఖ మహిళా అధికారిని రాజ్య లక్ష్మి( ఏ ఈ ఈ) .ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణ లో వుండగా ఉండగా ఏ ఈ ఈకి ఆటంకం కల్పిస్తూ, అంతేకాకుండా సదరు మహిళా అధికారినిపై దాడి చేసిన నేపథ్యంలో, దాడికి నిరసనగాఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యం లో, జిల్లా చైర్మన్ అలుక కిషన్ అధ్యక్షతన. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలిశారు. దాడికి పాల్పడిన నిందితులపై కఠినంగా శిక్షించాలని, వారిని శిక్షించే వరకు ఆందోళ‌న‌ ఆగదని తెలిపారు.

మహిళా ఉద్యోగికి న్యాయం జరిగేం తవరకు ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా సంఘం వారి వెంటే ఉం టుందని తెలిపారు, జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికా రులు, ఉద్యోగులను ఉద్దేశించి కిషన్ మాట్లాడుతూ… ఉద్యోగు లందరూ సమయస్ఫూర్తితో ఉండాలని. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే వరకు ఎంప్లాయిస్ జేఏసీ ఉద్యో గినికి న్యాయం జరిగేంత వరకు అండ‌గా ఉంటామని తెలిపారు…
ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, మాజీ టీఎన్జీవో జిల్లా కార్యదర్శి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సంఘం అమృత్ కుమార్ , నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ G.బద్రినారాయణ, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ A.ఉదయ్ కుమార్ , ఎగ్జిక్యూటివ్ ఇంజ నీర్ AR.అశోక్ కుమార్ , టీఎన్జీవో కేంద్ర సంఘ బాధ్యు లు పొల శ్రీనివాస్, అర్బన్ యూనిట్ అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, సత్యం, అతిక్ అహ్మద్, సంజీవయ్య ,ఉమా కిరణ్ నీటిపారుదల శాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పందిరి స్వామి,KP.సునీత, అధికారులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement