హైదరాబాద్ – ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 14 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. తొలిరోజైన బుధవారం అగ్రికల్చర్ కోర్సులకు రెండు విడుతల్లో ఎగ్జామ్‌ను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలివిడుత, మధ్యాహ్నం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయి. మొత్తం 57,577 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఇందులో ఉదయం విడతలో తెలంగాణ నుంచి 23,486 మంది, ఏపీ నుంచి 5,199 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం విడతలో తెలంగాణ నుంచి 23,691 మంది, ఏపీ నుంచి 5,201 మంది రాస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం బుధ, గురువారాల్లో అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు.
తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం…
Advertisement
తాజా వార్తలు
Advertisement