Friday, November 22, 2024

TS: అవకాశాలను అందిపుచ్చుకోండి.. ముందుకు దూసుకెళ్లండి… యువతకు కవిత పిలుపు

నిజామాబాద్ సిటీ, ఆగస్టు 29 (ప్రభ న్యూస్) : యువత రిస్క్ తీసుకుని అవకాశాలను అంది పుచ్చుకుని ముందుకెళ్లాలని ఎమ్మెల్సీ కవిత యువతకు పిలుపునిచ్చారు. ఇవాళ నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టాస్క్‌ ఆధ్వర్యంలో బోర్గాం వద్ద గల భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఐటీ జాబ్‌మేళాకు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జాబ్ మేళాకు హాజరైన ఎమ్మెల్సీ కవితకు ఘనంగా స్వాగతం పలికారు. బ్రహ్మకుమారీలు ఎమ్మెల్సీ కవితకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు ముందుగా తెలిపారు.

జాబ్‌మేళాలో గ్లోబల్‌ లాజిక్‌తోపాటు మొత్తం 41 వివిధ విదేశీ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన 41 కంపెనీలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. జాబ్‌మేళాలో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, గత జాబ్‌మేళాలో ముగ్గురు దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. యువత కోసం ఇలాంటి జాబ్‌మేళాలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. గ్రామీణ యువతకు ఇది గొప్ప అవకాశమని చెప్పారు.

ప్రతి నెలా ఇలాంటి జాబ్‌ మేళాలు నిర్వహిస్తామని అన్నారు. ఎమ్మెల్సీ కవిత సహకారంతో ఎన్నో విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, టాస్క్ సీఈఓ శ్రీకాంత్, ధర్పల్లి జెడ్పిటిసి బాజీరెడ్డి జగన్, నుడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి, నగర మేయర్ దండు నీతూ కిరణ్, డిసిఎంఎస్ చైర్మన్ సాంబారీ మోహన్, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement