Friday, November 22, 2024

EMACET – టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు విడుదల – బాలికలదే పై చేయి

హైదరాబాద్ : టీఎస్‌ ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, ఫార్మసీ ) ఫలితాలను గురువారం ఉదయం 9:30 గంటలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేసారు .  ఇక ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్‌, ఫార్మాలో 86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ ఎంసెట్‌లో సైతం బాలికలదే పై చేయి. ఇంజినీరింగ్‌లో 79 శాతం మంది అబ్బాయిలు, 85 శాతం మంది అమ్మయిలు క్వాలిఫై అయ్యారు. ఇంజినీరింగ్‌లో అనిరుధ్ అనే విద్యార్థికి మొదటి ర్యాంకు లభించింది. ఇంజినీరింగ్‌లో వెంకట మణిందర్ రెడ్డికి సెకండ్ ర్యాంకు లభించింది.. విద్యార్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in/ లో చెక్ చేసుకోవచ్చు…

ఇక, తెలంగాణలో ఎంసెట్ – 2023 పరీక్షను ఈ నెల 10 నుంచి 14 వరకు ఎంసెట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ పరీక్షకు మూడు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 1,95,275 మంది, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌కు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు.ఫలితాలు చెక్ చేసుకునే విధానం..- ఈ పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవడానికి విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత పరీక్ష హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో సిద్ధంగా ఉండాలి. – టీఎస్ ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/ లోకి వెళ్లాలి.- హోమ్ పేజీలో టీఎస్ ఎంసెట్ 2023 రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి. – తదుపరి దశలో విద్యార్థులు లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.- వివరాలు సమర్పించిన తర్వాత టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఫలితాలను భవిష్యత్తు అవసరం కోసం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement