తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫలితాల విడుదలపై కీలక ప్రకటన చేసింది. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో ఫలితాలను విద్యాశాఖ సెక్రటరీ విడుదల చేస్తారని ప్రకటించింది. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తామని బోర్డు అధికారులు తెలిపారు.
ఇక ఈ ఏడాది దాదాపు 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో 4.78 లక్షల మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉంటే.. 4 లక్షలకు పైగా ద్వితీయ సంవత్సరం స్టూడెంట్స్ ఉన్నారు.ఈ నెల 10వ తేదీ వరకు మూల్యాంకణం పూర్తి కాగా, ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమైంది. మార్కుల నమోదు పాటు సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టారు. కాగా, విద్యార్థులు రాసిన జవాబుపత్రాలను మూడేసి సార్లు పరిశీలించి కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం మే 9న ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. సారి 15 రోజుల ముందే ఫలితాలను వెల్లడించాలని బోర్డు నిర్ణయించింది.