Tuesday, November 19, 2024

TS : క‌రెంటు లేక మోటార్లు కాలిపోతున్నాయి… ఎంపీ అభ్య‌ర్థి వినోద్‌

కరెంటు సరిగా లేక రైతుల మోటార్లు కాలిపోతున్నాయని ఎంపీ అభ్య‌ర్థి వినోద్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌, పార్టీ నాయకులతో కలిసి వినోద్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. రైతుబంధు ఎప్పుడు ఇవ్వాలో కూడా రేవంత్‌ రెడ్డికి తెలియదని ఎద్దేవాచేశారు.

- Advertisement -

కరీంనగర్‌కు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు ఏం చేశారో చెప్పాలన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ కోసం కొట్లాడానని గుర్తుచేశారు. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు రైల్వే లైన్‌కోసం నిధులు తీసుకొచ్చానని తెలిపారు. కేబుల్‌ బ్రిడ్జి నిర్మించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు.

గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ అపూర్వ స్పందన వస్తున్నదని బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. రేవంత్‌ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కరెంటు ఎందుకు పోలేదు.. ఇప్పుడు ఎందుకు పోతున్నదని ప్రశ్నించారు. ఇండ్లలో మళ్లీ ఇన్వర్టర్లు కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్‌ ప్రభుత్వం విధ్వంసం చేస్తున్నదని విమర్శించారు.

కరీంనగర్‌కు ఉన్నత విద్యా సంస్థలు తేవాలనేది తన లక్ష్యమని పట్టణానికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ తీసుకొస్తానని, సింగపూర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. ఇప్పటికే విద్యాసంస్థకు అవసరమైన 150 ఎకరాల భూమిని కూడా గుర్తించామన్నారు. ఇన్నాళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ కరీంనగర్‌లోకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ ప్రజలు అభివృద్ధి కోరుకుంటారో.. విధ్వంసం కోరుకుంటారో ఒక్కసారి ఆలోచించాలన్నారు. పనిచేసే నాయకులకే ప్రజలు ఓటు వేయాలని కోరారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న నాయకులకు ప్రజలు బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రాబోయే రోజుల్లో కాలమే వారికి బుద్ధి చెబుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement