ఉతికిన బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మృతిచెందిన విషాద సంఘటన మెదక్ జిల్లా ఉసిరిక పల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే.. ఇంటి వద్ద ఉతికిన బట్టలు ఆరేస్తుండగా.. తడిబట్టలు పక్కనే ఉన్న వైర్లపై పడ్డాయి.
కరెంట్ షాక్ రావడంతో తల్లీకొడుకులైన మన్నెమ్మ (45), భాను ప్రసాద్ (19) మృతిచెందారు. ఇది గమనించిన మరొకరు వారిని కాపాడేందుకు ప్రయత్నించగా వారికి కూడా గాయాలయ్యాయి. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
- Advertisement -