ఈనెల 27న తెలంగాణలోని సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో గుర్తింపు పొందేందుకు వివిధ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు సార్లు బీఆర్ఎస్ గుర్తింపు సంఘంగా విజయం సాధించిన విషయం తెలిసిందే.
అయితే ఈసారి కాంగ్రెస్ విజయాన్ని కైవసం చేసుకోవాలని యోచిస్తోంది. గతంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలో కోల్ బెల్ట్ ఎన్నికల సందడి ప్రారంభమైందని తెలుస్తోంది.