Friday, November 22, 2024

Election Rules – రూ. 50 వేలు మించి న‌గ‌దు ఉంటే సీజ్ చేస్తాం .. కలెక్టర్ హన్మంతు కొండిబా

ప్రభన్యూస్, ప్రతినిధి / యాదాద్రి – అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళి, నిబంధనలు పాటించాలని భ‌వ‌న‌గిరి యాదాద్రి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జెండగె హన్మంతు కొండిబా అన్నారు. శనివారం గ్రీవెన్సీ కమిటీలో మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారము ఎవరు కూడా రూ. 50 వేల కన్నా ఎక్కువ నగదును తమ వద్ద ఉంచుకొని ప్రయాణం చేయరాదని తెలిపారు.
జిల్లాలో పోలీసు ఎఫ్.ఎస్.టి. బృందాలు తనిఖీలలో స్వాధీనం చేసుకున్న రూ. 50 వేలకు మించి నగదు, ఇతర వస్తువులను పరిశీలించి విడుదల చేసేందుకు “జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ” ఏర్పాటు చేసినట్ల తెలిపారు. విడుదల చేసేందుకు వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను కమిటీ కన్వీనర్ జిల్లా సహకార అధికారి కార్యాలయములో గ్రీవెన్స్ కమిటీ పరిశీలిస్తుందని, జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో జిల్లా సహకార అధికారి కార్యాలయం ఉందని తెలిపారు.

ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తంలో నగదు తెసుకెళ్లవద్దని, అలా దొరికిన నగదును సీజ్ చేసి డిపాజిట్ చేస్తామన్నారు. ఎన్నికలకు సంబంధం లేదని సరైన ఆధారాలు చూపితే తిరిగి ఇచ్చేస్తారని, అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, వివాహం ఇతర అవసరాలకు తీసుకెళ్ళేవాళ్ళు సరైన పత్రాలతో నగదును తీసుకెళ్లాలని సూచించారు. ఆధారాలు లేక సీజ్ అయిన నగదు విషయమై అప్పీలు చేసుకొనుటకు సరైన ఆధారాలతో ధరఖాస్తు చేసుకోవడానికి గ్రీవెన్స్ కమిటీ కన్వీనర్ జిల్లా సహకార అధికారి ఎన్. శ్రీనివాస రావు చరవాణి నెంబర్ 9100115660 సంప్రదించాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి సి.హెచ్. కృష్ణారెడ్డి, జిల్లా సహకార అధికారి ఎన్. శ్రీనివాసరావు, జిల్లా ట్రెజరీ అధికారి ఆర్.సురేశ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement