Tuesday, November 19, 2024

Election – రేపటి నుంచి హైద‌రాబాద్ సిటీ​లో ఆంక్షలు – మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్

లోక్​సభ ఎన్నికల పోలింగ్ నేప‌థ్యంలో పోలీసులు హైదరాబాద్​ సిటీలో ఆంక్షలను విధించారు. ఈ ఆంక్షలు శ‌నివారం సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయ‌ని హైద‌రాబాద్‌, రాచ‌కొండ‌, సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్లు ఉత్త‌ర్వులు జారీ చేశారు. పోలింగ్​ రోజున పోలింగ్​ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్​ అమల్లో ఉంటుందని ఆ రూల్స్‌లో పేర్కొన్నారు. పోలింగ్​ పరిధిలో అయిదుగురు కానీ, అంతకుమించి గుమిగూడొద్దని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకూ అన్ని రకాల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు.

మూడు రోజులు మ‌ద్యం షాపులు బంద్‌

ఏ లైసెన్సు కింద అనుమతి ఉన్నా మద్యం విక్రయాలపై ఆంక్షలు ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. 13వ తేదీన పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లు రెండు క్యూలైన్లలో ఉండాలని, పురుషులు, మహిళలకు వేర్వేరుగా మాత్రమే ఉంటాయని తెలిపారు. రెండు కంటే ఎక్కువ లైన్లలో ఉండడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని మూడు క‌మిష‌న‌రేట్ల పోలీసు క‌మిష‌న‌ర్లు హెచ్చరించారు.

- Advertisement -

మద్యం డ్రై డే కచ్చితంగా అమలు

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి పోలింగ్​ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​ రాజ్​ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు రోజున మద్యం దుకాణాలు తెరవరాదని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. జూన్​ 4న ఓట్ల లెక్కింపు రోజున సాయంత్రం 5 గంటల వరకు మూసి వేయాలని ఆదేశించారు. ఒకవేళ రీపోలింగ్​ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని వెల్లడించారు. మద్యం డ్రై డేను కచ్చితంగా అమలు చేయాలని ఎక్సైజ్​ శాఖకు సీఈవో స్పష్టం చేసింది.

ఆంక్షలు ఇవే..

  • అయిదుగురు మించకుండా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్లడానికి వీల్లేదు.
  • మైకులు, స్పీకర్ల ద్వారా పాటలు, ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించడం నిషేధం.
  • బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిళ్లు వంటి తాత్కాలిక నిర్మాణాలకు అనుమతి లేదు.
  • వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం నిషేధం.
  • పోలింగ్‌ కేంద్రాలకు కిలోమీటరు దూరంలో కర్రలతో కూడిన జెండాలు, తుపాకులు, మారణాయుధాలతో సంచరించడం నిషేధం.
  • ఆత్మరక్షణ కోసం కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వినియోగించడంపై నిషేధం.
  • మద్యం, కల్లు దుకాణాలు, బార్లు, మద్యం విక్రయించే అన్ని సంస్థలూ మూసేయాలి.
Advertisement

తాజా వార్తలు

Advertisement