Friday, November 22, 2024

Election Plans – అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బిజెపి విస్తార‌క్ లు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అసెంబ్లి ఎన్నికలు దగ్గర పడడంతో తెలంగాణలో బీజేపీ స్పీడ్‌ పెంచింది. అసెంబ్లి ఎన్ని కల్లో అధికార బీఆర్‌ఎస్‌ను, చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్‌ను మట్టికరి పించ డమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. తాజాగా అసెంబ్లిd ఎన్ని కల్లో గెలుపే లక్ష్యంగా ప్రజలను నేరుగా కలిసేం దుకు ప్రత్యేకంగా విస్తారక్‌లను రంగంలోకి దించింది. త్వరలో అసెంబ్లిd ఎన్ని కలు జరగనుండ డంతో రాష్ట్రంలో పోలింగ్‌ బూత్‌ల పరిధిలో బీజేపీని బలోపే తం చేసే బాధ్యత తోపాటు తెలంగాణలో పార్టీ అనుస రించాల్సిన వ్యూహానికి సంబం ధించిన వాస్తవ పరిస్థితులను విస్తారక్‌ల ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం అధ్యయనం చేయిసు ్తన్నట్లు తెలుస్తోం ది. తమకు కేటాయించిన ఆయా మండలా ల్లోని బూత్‌ లకు విస్తారక్‌లు వెళ్లి అక్కడి పార్టీ కమిటీలతో సమా వేశం కానున్నారు. వారి పనితీరుపై పలు సూచనలు చేస్తారు.

బూత్‌ కమిటీలను వెంటబెట్టుకుని ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలు స్తారు. బూత్‌ కమిటీలు లేనిచోట్ల వాటిని ఏర్పాటు చేస్తాేరని సీనియర్‌ నేతలు చెబుతు న్నారు. ఇంటింటికీ బీజేపీ కార్య క్రమాన్ని విసా ్తరక్‌ల నేతృత్వంలో బీజేపీ వివరించ నుం ది. కేంద్ర ప్రభు త్వం తెలంగాణ కు కేటాయించిన నిధులు, ప్రజా సంక్షే మ పథకాలను ఓటర్లకు విస్తారక్‌లు వివరించ నున్నారు.
రాష్ట్రంలో రాజకీయ పరి స్థితులు, బూత్‌ స్థాయిలో పార్టీ ఏ మేరకు పటిష్టంగా ఉంది..?, పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కో గలదా..? , నేతలు, కార్య కర్తలకు సూచిం చాల్సిన వ్యూహం ఏంటీ..? తదితర అంశాలపై విస్తృతంగా విస్తారక్‌లు పర్య టించి పార్టీ జాతీయ నాయకత్వానికి ‘సమ గ్ర నివేదిక సమర్పించ నున్నారు. ఆ నివేదికను రాష్ట్రనాయ కత్వంతో ప్రత్యేక సమావేశంలో చర్చించి అసెంబ్లిd ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని బీజేపీ జాతీయనాయకత్వం ఖరారు చేయనుంది.

అసెంబ్లిd ఎన్నికల వేళ పార్టీ పరిస్థితిని అధ్య యనం చేయడంలో భాగంగా విస్తారక్‌లు పోలింగ్‌ బూత్‌ కేంద్రంగా ఆయా మండలాల్లోని ఓటర్లను ఇంటింటికీ వెళ్లి ప్రత్యక్షంగా కలవనున్నారు. దాదాపు నెల రోజులపాటు విస్తారక్‌లు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న మండలాల్లో పర్యటించి సమగ్ర నివేదికను రూపొందించనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 36వేల పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. ఒక్కో బూత్‌లో 21మందితో కమిటీలు కూడా 70శాతం బూతుల్లో ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా బూత్‌ల పరిధిలో పార్టీ ప్రజల్లోకి ఏమేరకు వెళ్లింది..?, ప్రజా సమస్యలపై బీజేపీ క్షేత్రస్థాయి నేతలు ఏ మేరకు ఉద్య మిస్తున్నారు..?, ఆయా మండలం, జిల్లాలో ఓటర్లను ప్రభావితం చేయగల నేతలు ఎవరు..?, వారిలో ఎంతమంది బీజేపీలో ఉన్నారు..?, కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయి..?, ప్రజల వైఖరి కేంద్ర ప్రభుత్వంపై ఏయే అంశాల్లో సానుకూలంగా ఉంది..?, ఏయే అంశాలు, కారణాల పరంగా కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు అసం తృప్తితో ఉన్నారు..?, ప్రజల్లో ఉన్న సానుకూలత, అసంతృప్తి ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపనుంది తదితర కీలక అం శాలను విస్తారక్‌లు నెల రోజుల స్వల్పకాలంలో పార్టీ జాతీ య నాయకత్వానికి సమగ్రంగా వివరించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈ మేరకు వివిధ రాష్ట్రాలకు చెందిన 650 మంది విస్తారక్‌లు బుధవారం తెలంగాణకు చేరుకున్నారు. సికింద్రా బాద్‌ రైల్వే స్టేషన్‌లో 350మంది, 100మంది మంచిర్యా లపట్టణంలో కాజీపేటలో 250 మంది దిగారు. వీరికి సికింద్రా బాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కాజీపేటలో బీజేపీ సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌, మంచిర్యాలలో మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. దాదాపు 20 ఏళ్ల నుంచి 35ఏళ్లలోపు వారినే విస్తారక్‌లుగా నియమించి తెలంగాణలో బీజేపీ జాతీయ నాయకత్వం మోహరించింది.

దాదాపు నెలపాటు మండలాల వారీగా బూతుల్లో విస్తారక్‌లు విస్తృతంగా పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటన సమయంలో గమనించాల్సిన అంశాలు, సేకరించా ల్సిన వివరాల విష యంలో భోపాల్‌లో బీజేపీ జాతీయనాయ కత్వం రెండు రోజులపాటు విస్తారక్‌లకు సమగ్ర శిక్షణ అందిం చింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 1040 మండలాల్లో వీరు పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతు న్నారు. మండలానికి ఒక విస్తారక్‌ చొప్పున పర్యటించ నున్నారు. హైదరాబాద్‌ జంట నగరాల పరిధి వంటి కొన్నిచోట్ల ఒక విస్తారక్‌ మూడు , నాలుగు మండలాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement