తెలంగాణలో ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దాంతో.. పోలీసులు ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేస్తున్నారు.
అందులో భాగంగా కరీంనగర్ నుండి సిరిసిల్లకు వెళ్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వాహనాన్ని కొదురుపాక వద్ద ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. మంత్రితో పాటు వాహనంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కే. కేశవరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఉండగా ఎన్నికల అధికారుల తనిఖీలకు సహకరించారు.