తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ల ప్రక్రియా ఇవాళ్టి నుంచి షూరు కానుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. ఈ నెల 30న పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు.
నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి ఆ దరఖాస్తును రిటర్నింగ్ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ల పరిశీలన నవంబర్ 13న, నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 15, పోలింగ్ తేదీ నవంబర్ 30న ఉదయం 7 గం.ల నుంచి 5 గం.ల వరకు, 13 నక్సల్స్ ప్రభావిత స్థానాల్లో సా.4 గం వరకే పోలీంగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3తో ఫలితాలు వెలవడనున్నాయి.