Saturday, November 23, 2024

Election Meeting – అంబలి , అన్నదానం చేస్తే చేసిన పాపాలు పోతాయా – బండి సంజయ్

కాగజ్ నగర్నవంబర్ 10(ప్రభన్యూస్)అంబలి అన్నదానం చేస్తే చేసిన పాపాలు పోతాయా అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం సిర్పూర్ టౌన్ లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నామినేషన్ వేసిన అనంతరం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ విజయసంకల్ప సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులారా ప్రభుత్వాలనే మార్చేసిన చరిత్ర మీకు ఉందన్నారు. కేసీఆర్ అరాచక పాలన ఎట్లుందో మీరు గుర్తుచేసు కొండని తెలిపారు.

మీకోసం కొట్లాడిన బిజెపిని గెలిపించండని పొరపాటున మళ్లీ కెసిఆర్ అధికారంలోకి వస్తే మూడు నెలలకు ఓసారి జీతాలు వస్తాయని, బదిలీలు, ప్రమోషన్లు రావని గుర్తుంచుకోవాలని అన్నారు.తెలంగాణలో తొలి ఓటరు నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్ అని బిజెపి తొలి విజయం కూడా ఇక్కడే అని ధీమా వ్యక్తం చేశారు.కోనప్పా ఇక చాలప్పా ఇగ ఆంధ్రకు వెళ్లిపో అప్పా అంటూ ఎద్దేవా చేశారు.సిర్పూర్ కాగజ్ నగర్ బిజెపి అభ్యర్థిగా డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నామినేషన్ వేసిన సందర్భంగా సిర్పూర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వేలాది మంది తరలివచ్చారు.ఈ సందర్భంగా బండి సంజయ్ సమక్షంలో పలువురు నాయకులు బిజెపిలో చేరారు.

భారతీయ జనతా పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.పాల్వాయి హరీష్ బాబు. మాట్లాడుతూ మూడుసార్లు కోనేరు కోనప్పకు అవకాశం ఇచ్చి సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు అన్యాయానికి గురయ్యారని, ఎక్కడా అభివృద్ధి అనేది మచ్చుకైనా కనిపించడం లేదని దుయ్యబట్టారు. ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వమని పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఒక్క అవకాశం చదువుకున్న వాడికి, డాక్టర్ కు, ఉన్నత విద్యావంతుడికి, పురుషోత్తం రావు కొడుకుకు అవకాశం ఇస్తే రాబోయే రోజులలో మళ్లీ పురుషోత్తం రావు గారి పాలన పునరుద్ధరిస్తామని పిలుపునిచ్చారు.అలాగే నాలుగు లైన్ల జాతీయ రహదారి మంజూరు చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement