Friday, November 22, 2024

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు

నిజామాబాద్ సిటీ, జూలై( ప్రభ న్యూస్)12 : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిని ధుల బృందం సభ్యులు బుధవారం జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ప్రతినిధుల బృందంలోని సభ్యులు ప్రమోద్ కుమార్ శర్మ, రితేష్ సింగ్ లు నిజామాబాద్ కు చేరుకున్న సందర్భంగా ముందుగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా తదితరులు వారికి స్వాగతం పలికారు. జిల్లాలో చేపట్టిన రెండవ విడత ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవర ణ కార్యక్రమం వివరాల గురిం చి కేంద్ర ఎన్నికల బృందం దృష్టి కి తేగా, ఎన్నికల సంఘం నిబం ధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియ జరిగిందా లేదా అని బృందం సభ్యులు వివరాలను నిశితంగా పరిశీలించారు.

కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల జాబితాను పరిశీలిం చారు. క్షేత్ర స్థాయిలోనూ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల జాబితా తీరుతెన్నులను పరిశీలన జరిపారు. ముఖ్యంగా ఒకే ఇంట్లో ఆరుగురు అంతకం టే ఎక్కువ ఓటర్లు ఉన్న వాటి గురించి వివారాలు ఆరా తీశారు. వీరి వెంట నిజామా బాద్ ఆర్డీఓ రవి తో పాటు ఆయా శాసనసభ నియోజకవర్గ కేంద్రాల తహసీ ల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు ఉన్నారు

ఈవీఎం ల పనితీరుపై అవగాహన ఏర్పరుచుకోవాలి : కలెక్టర్

- Advertisement -

ప్రజాస్వామ్య వ్య్వవస్థలో కీలకమైన ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రతి ఒక్కరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)ల పనితీరుపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఈవీఎంలు, వి.వి.ప్యాట్ ల వినియోగం, వాటి పనితీరుపై అవగాహన కల్పించేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన అవగాహన కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ కేంద్రంలో ప్రజల అవగాహన నిమిత్తం అందుబాటులో ఉంచిన నమూనా ఈవీఎం, వి.వి.ప్యాట్ ల పనితీరును స్వయంగా పరిశీలించి పలు వివరాలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవగాహన కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రెండు చొప్పున అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement