దీక్షదీవాస్‌కు ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసింది. ప్రచారం గడువు ముగిసినందున ఈసీ స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించవద్దని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని పేర్కొంది. తెలంగాణ భవన్ బయట, ఆవరణలో కార్యక్రమాలు చేయొద్దని ఆదేశించింది.
దీక్షా దివస్ ఎన్నికల కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లోపల రక్తదాన శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. రక్తదాన శిబిరం నిర్వహణకు ఎన్నికల అధికారులు అంగీకరించడంతో.. బీఆర్ఎస్ నేతలు.. రక్తదాన శిబిరం నిర్వహించారు. తెలంగాణ భవన్కు చేరుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ దీక్షా దివస్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అక్కడ నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం దానం చేశారు. తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం దీక్షా దివస్ అని కేటీఆర్ పేర్కొన్నారు. నవంబర్ 29, 2009 కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన ఈరోజు.. మలిదశ ఉద్యమంలో లక్ష్యం దిశగా అడుగులేసేందుకు మార్గదర్శకమైందని.. ఆ స్ఫూర్తిని కొనసాగిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.