హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కారుకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రైతు బందు నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తర్వాత నిధులు విడుదల చేయాలని స్పష్టం చేసింది. రైతు బంధు విషయంలో ఎన్నికల కమిషన్‌కు ఎన్ వేణుకుమార్ ఫిర్యాదు చేశారు. రైతు బంధు చెల్లింపులపై రేవంత్ వ్యాఖ్యలపై ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ సీఎం రేవంత్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. ఎన్నికలు జరుగుతున్న వేళ బహిరంగంగా ఈ నెల తొమ్మిదిలోగా అయిదు ఎకరాల రైతులకు రైతు బంధు నిధులు వారి ఖాతాలలో జమ చేస్తామని ప్రకటించడం కోడ్ ఉల్లంఘనేనంటూ నిధులు విడుదలను ఆపాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించింది ఎన్నికల కమిషన్.
Advertisement
తాజా వార్తలు
Advertisement