Monday, November 18, 2024

Election Campaign – కాంగ్రెస్ వచ్చేది లేదు.. చచ్చేది లేదు… కెసిఆర్

కాంగ్రెస్ పార్టీ వస్తే.. దళారీల రాజ్యం, పైరవీకారుల రాజ్యం వస్తుంది. ఎందుకంటే ధరణీని బంగాళాఖాతంలో వేస్తారంట, అసలు ఆ పార్టీ వచ్చేది లేదు, చచ్చేది లేదు. కానీ కత్తి ఒకరి చేతిలో పెట్టి..ఇంకొకరిని యుద్ధం చేయమంటే.. జరిగేది నష్టమే అని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తాండూర్లో బీఆర్ఎస్ చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగానికి జనం ఫిదా అయ్యారు. కరెంటు ఎన్ని గంటలు కావాలని కేసీఆర్ ప్రశ్నిస్తే.. 24 గంటలు కావాలని జనం హోరెత్తారు. రైతు బంధు వద్దా? ధరణి తీసేయాలా? అని సీఎం ప్రశ్నిస్తే..కావాలి, కావాలి అని మార్మోగారు. ఇవ్వన్నీ ఉండాలంటే పైలట్ రోహిత్ రెడ్డిని గెలిపించాలని కేసీఆర్ సూచించారు.


ఈ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, 50 కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎలా ఉంది? పదేళ్ల కాలంలో మనం ఎట్టా ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి, కాంగ్రెస్ పాలనలో తాగటానికి నీళ్లు లేవు, కరెంటు లేదు, సాగునీరు లేదు, రైతులకు అష్టకష్టాలు తప్పా మరో అంశమే లేదని, ఈ రోజు తెలంగాణాలో ఈ సమస్యలన్నీ సమసి పోయాయని కేసీఆర్ వివరించారు.
గుక్కెడు నీళ్ల కోసం పడిన కష్టాలు గుర్తు చేసుకోండని తాండూరు ప్రజలకు వివరించారు. గుంతల్లో నీటిని వడగట్టి తాగారు, ఇప్పుడు మారు మూల పల్లెలకే కాదు, తండాలకూ పరిశుభ్ర నీటిని సరఫరా చేస్తున్నాం, కరెంటు పోతే ఎప్పుడు వస్తాదో తెలీదు., అర్ధరాత్రి బావుల దగ్గర పడిగాపులు పడి, కరెంటు షాకుతో, పాము కాటుతో ఇక్కడ 30 నుంచి 40 మంది రైతులు చనిపోయారు. ఇప్పుడా పరిస్థితి లేదు. 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తుంటే.. కరెంటును వృథా చేస్తున్నామని, మూడు గంటలు సరిపోతుందని టే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు. మూడు గంటలు కరెంటు సరిపోతుందా? అని కేసీఆర్ ప్రశ్నించారు.


ఇక రైతు చల్లగా ఉంటే దేశం బాగుంటుందని సాగునీరు సమస్యపు పరిష్కరించాం. రైతుకు ఊతంగా రైతు బంధు పెడితే.. మరో కాంగ్రెస్ నాయకుడు రైతు బంధు వృథా అంటున్నాడు. ప్రజలు కట్టిన పన్నుల్ని కేసీఆర్ దుబారా చేస్తున్నారని తెగ బాధపడుతున్నారని, రైతు బంధు వద్దని అంటున్నారని కేసీఆర్ వివరించారు. ఇంతకీ రైతు బంధు కావాలా? వద్దా అని ప్రశ్నించారు. కాంగ్రెసోళ్లు వచ్చేది లేదు, చచ్చేది లేదు, రైతుబంధు, ధరణీ కావాలంటే రోహిత్ రెడ్డిని తప్పకుండా గెలిపించాలని కేసీఆర్ కోరారు.
తాండూరుకు దగ్గరలోనే కర్ణాటక రైతులు గోస వినండి. అక్కడ కరెంటు కష్టాలను తెలుసుకోండి. మరో సారి 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ గతి ఏంటీ? ఇప్పడు బీఆర్ఎస్ పాలనలో రాప్ర్టం స్థితి ఏంటీ? ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు సాగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ తాండూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement