Tuesday, November 19, 2024

TS Election Campaign : తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇన్నాళ్లు చెవులు చిల్లులు పడేలా మోగిన మైకులు మూగబోయాయి. నెలన్నర రోజుల పాటు సాగిన ప్రచారాలు మూగబోయాయి. ఎన్నికలంటే ఓ పండగలా సాగిన వాతావరణం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ప్రచారాలతో హోరెక్కించారు. ప్రచారంలో ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం జరిగింది. హామీల వర్షం కురిసింది. మరికొన్ని రోజుల్లో ప్రజలు ఎవర్ని మెచ్చారో, ఎవర్ని ఇంటికి పంపారో తెలిసిపోనుంది.


తెలంగాణ ఎన్నికల్లో పోటీలో ఉన్న 2290 మంది అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో 221 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా, 45 వేల మంది పోలీసులు భద్రతా విధులు నిర్వర్తిస్తు్న్నారు. మంగళవారం సాయంత్రం నుంచి సోషల్‌ మీడియాలోనూ రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదని ఈసీ తెలిపింది. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాను రంగంలోకి దింపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement