Friday, November 22, 2024

Election Camapaign – నిరుద్యోగుల‌తో రాహుల్ గాంధీ మాటా మంతి… బావర్చిలో బిరియానితో డిన్న‌ర్…

హైద‌రాబాద్ – తెలంగాణలో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ గెలుపే ధ్యేయంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. . ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌కు విజయం సాధించేందుకు ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ రాష్ట్రంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శల వర్షం చేస్తున్నా రాహుల్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తమ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చెబుతూనే ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు.


ఈ క్ర‌మంలోనే ముందు షెడ్యూల్ లేక‌పోయినా రాహుల్ గాంధీ గ‌త‌ రాత్రి ఆకస్మికంగా హైదరాబాద్ పర్యటించారు. నగరంలోని ముషీరాబాద్‌, అశోక్‌నగర్‌లోని కోచింగ్ సెంట‌ర్ల‌ను సంద‌ర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. నిరుద్యోగులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ బాధలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పేపర్ లీకేజీలు, నోటిఫికేషన్లు నిలిచిపోయిన ఘటనలపై నిరుద్యోగులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. నిరుద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అనంతరం చిక్కడపల్లిలోని బావర్చి హోటల్‌లో రాహుల్ నిరుద్యోగులతో కలిసి బిర్యానీ తిన్నారు. అక్కడ కస్టమర్లను కలిశారు. వారితో మాట‌లు క‌లిపారు… హ‌స్తం గుర్తుకు ఈసారి ఓటేయాల‌ని అభ్య‌ర్ధించారు. ఈ క్రమంలో పలువురు రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగారు. అలాగే రాహుల్ ప‌లువురు క‌ర‌ఛాల‌న చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement