మల్కాజ్ గిరిలో పోటీ చేస్తున్న మైనంపల్లి హనుమంతరావు తమ అభ్యర్ధి రాజశేఖరరెడ్డి చేతిలో ఓడిపోవడం ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు.. మల్కాజిగిరి నియోజికావర్గం పరిధిలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధ్వర్యంలో బిజెపి పార్టీ నుండి భారీ చేరికలు జరిగాయి. సుమారు రెండు వేల మంది వివిధ పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మల్కాజిగిరి లో ఉన్నత విద్యావంతుడు మంచి మనిషి అయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ కు మల్కాజ్ గిరి సెగ్మెంట్ గుండెకాయ వంటిందన్నారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని ప్రముఖులు ప్రశంసిస్తున్నారన్నారు. దీనిని మరింత అభివృద్ది చేసేందుకు ఓటర్లు బిఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని కోరారు.. ఇదే సందర్భంతో డబ్బు ఆహంకారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ అభ్యర్ధి మైనంపల్లి హనుమంతురావును ఓటుతో ఓడించి డబ్బు మత్తు దించాలన్నారు.. రాజశేఖరరెడ్డి కోరితే మల్కాజ్ గిరిని దత్తత తీసుకుంటా అన్నారు. కాలుష్యం తక్కువున్న నగరంగా హైదరాబాద్ కు గ్లోబల్ అవార్డులు వస్తున్నాయన్నారు. అలాగే ఢిల్లీలో అవార్డులు ఇస్తారు.. గల్లీలో తిడతారని కేంద్రంపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.