ఆదాయంలో దుమ్ము రేపింది తెలంగాణ ఆర్టీసీ. ఏకంగా రూ. 15.59 కోట్లు ఆర్జించింది. అలాగే, ఆక్యుపెన్సీ కూడా 85.10 శాతం నమోదు కావడం గమనార్హం. ఈ స్థాయిలో ఆదాయం రావడం గత మూడు నెలల్లో ఇదే తొలిసారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.నిన్న 34.69 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడవగా, మొత్తంగా 34.17 లక్షల మంది గమ్యస్థానాలకు చేరారు. నిజానికి నిన్న రూ.13.64 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, అదనంగా రూ.1.95 కోట్ల ఆదాయం రావడంతో అధికారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా, కరోనా తర్వాత ఇంత భారీ మొత్తంలో ఆదాయం రావడం ఇది రెండోసారని అధికారులు తెలిపారు. మొత్తానికి ఆర్టీసీకి కాసుల పంట కురవడం విశేషం.
Advertisement
తాజా వార్తలు
Advertisement