Thursday, January 9, 2025

NZB | త్వరలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల ప్రారంభానికి కృషి.. ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ ప్రతినిధి, జనవరి 8(ఆంధ్ర ప్రభ) : ప్రజా ఆరోగ్యం, అవసరాలకు అనుగుణంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను త్వరలో ప్రారంభించేలా కృషి చేస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. బుధవారం నగరంలోని అహ్మది బజార్, ఖలీల్ వాడిలోని ఇంటిగ్రేటెడ్ మార్కె ట్లను అర్బన్ శాసనసభ్యు లు ధన్ పాల్ సూర్య నారాయణ మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. అహ్మది బజార్ లో రూ.9 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులు పూర్తయి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా ప్రారంభం కాకపోవడంతో అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు.

- Advertisement -

97 షటర్స్ తో నిర్మాణమైన మార్కెట్ నాన్ వెజ్ కు 38, జనరల్ కు 59 చొప్పున విధివిధానాలకు లోబడి కేటాయింపులు జరుగుతాయని, ప్రజలకు త్వరలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఖలీల్ వాడిలోని మల్టీపుల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు రూ 4.50 కోట్ల వ్యయంతో దాదాపు పూర్తి కావడం జరిగిందన్నారు. మిగిలిన పనులకు రూ.1.50 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. త్వరలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

మల్టీపుల్ ఇంటిగ్రేటెడ్ మార్కె ట్ లో నాన్ వెజ్ 32, ఫ్లవర్ అండ్ ఫ్రూట్స్ 16,వెజ్ 64 స్టాల్స్ ను మున్సిపల్ విధివిధానాలకు లోబడి కేటాయింపులు జరుగుతాయన్నారు. మార్కెట్ల ప్రారంభం ఆలస్యానికి గల కారణాలు నగర పాలక సంస్థ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. చట్టపరమైన విధివి ధానాలు పూర్తి చేసి అతి త్వరలో మార్కెట్ ప్రారంభానికి కృషి చేయాలని సూచించారు. నిజామాబాద్ కార్పొ రేషన్ ను తెలంగాణలో ఆదర్శవంతంగా మొదటి స్థానంలో నిలబడేలా కృషి చేయాలన్నారు. ఇందుకు నగర ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళి, ఆర్ అండ్ బీ డిపార్ట్ మెంట్ ఏఈ సాయికుమార్, మున్సిపల్ సిబ్బంది, బీజేపీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement