పటాన్చెరు, (ప్రభన్యూస్): మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి నిబద్ధతతో కృషి చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో ఆషుర్ ఖాన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మైనార్టీలలో పేదరికం తొలగించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 210 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించారన్నారు.
మైనారిటీల సంక్షేమానికె కృషి చెస్తున్నామని. నిరుపేద మైనార్టీ యువతుల వివాహాల కోసం షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టి, లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గోపాల్, లక్ష్మణ్, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily