Wednesday, January 8, 2025

ADB | బీఆర్ఎస్ అధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

చెన్నూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని 12,000 వేలు ఇవ్వడం సిగ్గుచేటని ఆరోపించారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతు ఎకరాకు రూ.15,000లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement