Thursday, November 21, 2024

టీఎస్‌ ఈ-సెట్‌ పరీక్షల‌పై వర్షాల ఎఫెక్ట్‌.. 13న జరగాల్సిన ఎగ్జామ్ పోస్ట్ పోన్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. 13న జరగాల్సిన టీఎస్‌ ఈ-సెట్‌ను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు. అయితే ఈనెల 14 నుంచి జరిగే ఎంసెట్‌ పరీక్షలు మాత్రం యధాతథంగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల రిత్యా ఈనెల 11 నుండి 13వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఈసెట్‌, ఎంసెట్‌ నిర్వణపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈమేరకు ఈ-సెట్‌ ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే పరీక్ష నిర్వహించబోయే తేదీని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఎంసెట్‌ పరీక్షను కూడా వాయిదా వేయాలని అధికారులు యోచించారు. కానీ ఇప్పడు నిర్వహించకుంటే ఆతర్వాత నిర్వహించడం చాలా కష్టమవతోందని భావించారు. వివిధ తేదీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షలు ఉండడంతో కేవలం టీఎస్‌ ఈసెట్‌ పరీక్షను మాత్రమే వాయిదా వేశారు. ఎంసెట్‌ పరీక్షను ముందస్తుగా అనుకున్న తేదీల్లోనే(14 నుంచి) పరీక్షలు యధాతథంగా నిర్వహించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement