Tuesday, November 26, 2024

పట్టణాలకు మహర్దశ : మంత్రి సబితారెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో పురపాలక మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణలోని పట్టణాలకు మహర్దశ పట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితారెడ్డి అన్నారు. సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, భగత్ సింగ్ నగర్, క్రాంతి నగర్, ఉర్దూ మీడియం స్కూల్ దగ్గర, వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 3, భగత్ సింగ్ నగర్ పేస్ -2 కాలనీలలో రూ.85 లక్షల రూపాయలతో చేపట్టే యూజీడీ పైప్ లైన్ పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ…. శివార్లలో పెరుగుతున్న కాలనీలకు రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశ్యంతో మిషన్ భగీరథ ద్వారా రూ.1200 కోట్ల నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారని తెలిపారు. మిషన్ భగీరథ కు కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు కురిపిస్తోందని తెలిపారు. మునిసిపల్ శాఖపై మునిసిపల్ మంత్రి కేటీఆర్ పూర్తి అవగాహనతో ప్రణాళిక బద్ధమైన అభివృద్ధికి బాటలు వేస్తున్నారనీ కితాబిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా తీసుకున్న చర్యలతో నేడు స్వచ్ఛ కాలనీలు, బస్తీలుగా మారడంతో గతంలో కన్నా సీజనల్ వ్యాధులు తగ్గాయని తెలిపారు. సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్, నూతన లైన్ల కోసం రూ.3500 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారని సబితారెడ్డి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement