Tuesday, November 26, 2024

TS : విద్యకే అధిక ప్రాధాన్యం… మంత్రి పొన్నం..

తెలంగాణాలో అన్ని రంగాల కంటే అత్యధిక ప్రాధాన్యత విద్యకే ఇస్తాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్పొరేట్ స్కూల్‌కి మించి మనం పోటీపడాలని విద్యార్థులతో ఆయన అన్నారు. ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమం ద్వారా అమీర్‌పెట్ డీకే రోడ్డులోని గర్ల్ ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్‌లలో రెనోవేశన్ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, డీఈవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ… ‘మారుతున్న కాలానికి అనుగుణంగా, సాంకేతికతతో మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. అన్ని రంగాల కంటే అత్యధిక ప్రాధాన్యత విద్యకి ఇస్తాం. నేను విద్యార్థి నాయకుని నుండి ఈ స్థాయికి వచ్చా. ఇక్కడ 900 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరగాలి. కార్పొరేట్ స్కూల్‌కి మించి పోటీ పడాలి. గ్రామీణ ప్రాంత వాతావరణంకి అనుగుణంగా ఇక్కడ చెట్లు ఉన్నాయి. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఈసారి మంచి రిజల్ట్ రావాలి’ అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement