Friday, November 22, 2024

Education: నవంబర్‌ 6 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యంకనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నవంబర్‌ 6 నుంచి ప్రారంభించనున్నారు. నవంబర్‌ 6, 8వ తేదీల్లో రెండు విడతల్లో మూల్యాంకనం చేపట్టనున్నారు. కరోనా కారణంగా గతేడాది రద్దు అయిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలను ఈనెల 25 నుంచి నవంబర్‌ 3వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే మూడు పరీక్షలు అయిపోయాయి. పరీక్షలు ముగిసిన వెంటనే నవంబర్‌ 6 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్‌ బోర్డు అధికారులు చేపడుతున్నారు. 6వ తేదీన సంస్కృతం, ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, మ్యాథ్స్‌-ఏ, బీ, పొలిటికల్‌ సైన్స్‌, బాటనీ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతాయి.

8న ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, కెమిస్ట్రీ, హిస్టరీ, కామర్స్‌, జూవాలజీ జవాబు పత్రాల మూల్యాంకనం చేయనున్నారు. దీనికి సంబంధించిన సిబ్బందిని ఇప్పటికే నియమించారు. జనరల్‌, వొకేషనల్‌ పరీక్ష పత్రాలు ఒకేసారి మూల్యాంకనం చేయనున్నారు. మూల్యాంకనం అయిన తర్వాత కొన్ని రోజుల్లో పరీక్ష ఫతితాలను వెలువరించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement