ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కొత్త కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. సమాజానికి అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దడంపై ఓయూ దృష్టి పెట్టింది. కరోనా నేపథ్యంలో ప్రజల్లో వ్యాయామం, యోగా, మెడిటేషన్, డైటింగ్ వంటి పలు అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో యోగాకు విపరీతమైన డిమాండ్ ఏర్పడగా దీనికి అనుగుణంగా దూరవిద్యా విధానం ద్వారా ఆ కోర్సును అందించబోతున్నారు. దీనికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డారు యూనివర్సిటీ అధికారులు. వీడియో పాఠాలు, టెస్ట్ బుక్స్, సిలబస్ తయారు చేయించేందుకు నిపుణులతో యూనివర్సిటీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement