Friday, November 22, 2024

Editorial – అగ్ర‌దేశం ఆధారాల‌తో మాట్లాడాలి….

అమెరికాలో స్థిరపడిన ఖలిస్తానీ ఉగ్రవాది పత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు జరిగిన కుట్రలో భారత పౌరుని పాత్ర ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్పందించారు. అసలు ఆ ఆరోప ణకు ఆధారాలేమిటో తెలియ జేయకుండా భారత్‌పై బుర దజల్లే ప్రయత్నం చేయడాన్ని ఆయన ఖండించారు. అమెరికా వద్ద ఆధారాలుంటే, వాటిని అందజేస్తే తప్ప కుండా దర్యాప్తు జరిపిస్తామని మోడీ హామీ ఇచ్చారు. ఈ ఆరోపణలు కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్నాయి. కానీ, వీటిపై మోడీ స్పందించడం ఇదే మొదటిసారి. భారత్‌కి వ్యతిరేకంగా విదేశాల్లో ఉన్న వారు ఏవేవో ఆరొపణలు చేస్తూ ఉంటారు. బాధ్యతగల ప్రభుత్వం వా టిలోని నిజానిజాలేమిటో సరిచూసుకోవాలి. తమ వద్ద తగిన సమాచారం లేకపోతే భారత ప్రభుత్వాన్ని అడ గాలని మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ని ఉద్దేశించి అన్నారు. ఈ వ్యవహారంతో భారత్‌, అమెరికాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని తాను అనుకో వ డం లేదని ఆయన స్పష్టం చేశారు. పన్నూ హత్యకు జరి గిన కుట్రలో నిఖిల్‌ గుప్తా అనే భారత పౌరునికి ప్రమేయం ఉందని అమెరికాలోని ఫెడరల్‌ ప్రాసి క్యూ టర్లు అతడిపై అభియోగాలు మోపారు. వాటిలో వాస ్తవాలు ఏమిటో తెలుసుకోకుండా అక్కడి ప్రభుత్వం భా రత్‌ని వేలెత్తి చూపడం సరికాదు. అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులే కాకుండా, ఇతరులు సైతం భా రత్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వాటిని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడానికి బదులు అవే నిజమనుకునే రీతిలో ప్రకటనలు చేయడం ఎంత మా త్రం సబబు కాదు. ఇదే విషయాన్ని అమెరికన్‌ ప్రభు త్వా నికి మోడీ స్పష్టం చేశారు.

నిఖిల్‌ గుప్తా భారత్‌లోని ఒక ఉద్యోగితో కుమ్మక్కయినట్టు కూడా ఫెడరల్‌ అటా ర్నీలు ఆరోపించారు. నిఖిల్‌ గుప్తా చెక్‌లోని ఒక జైలులో ఉన్నారు. అతడిని తమ దేశం రప్పించేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో భారత్‌ ప్రభు త్వంపై బురదజల్లే కార్యక్రమాన్ని ప్రారంభిం చింది. ఖలిస్తాన్‌ ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లా డుతున్న కెనడా ప్రభుత్వాన్ని అమెరికా గుడ్డిగా సమ ర్థిస్తోంది. ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు కెనడాలో తల దాచుకుని భారత్‌కి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. హిందూ ఆల యాలపై దాడి చేస్తున్నారు. ఈ విషయం గురించి మా త్రం అమెరికా మాట్లాడకపోవడం గమ నార్హం. కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో ఇటీవల మళ్ళీ అదే ఆరో పణ చేశారు. కెనడాను అమెరికా వెన కేసుకుని రావడం అగ్రరాజ్యం అనుసరిస్తున్న పాక్షిక వైఖ రికి నిదర్శనం. గతంలో కూడా పాకిస్తాన్‌ను అమెరికా ఇదే మాదిరిగా వెనకేసుకుని వ చ్చింది. తర్వాత వాస్త వాలు తెలుసు కుంది.

పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర వాదులు సరి హద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న భారత్‌ ఆరో పణను అమెరికా మొదట పట్టించుకోలేదు. అలాగే, ఇప్పుడు ఖలిస్తాన్‌ ఉగ్రవాదులపట్ల కూడామెత క వైఖరి ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. హిందువులు లక్ష్యంగా ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు అమెరికాలో కూడా దాడులను జరుపుతున్నారు. ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాల పై దాడులు జరుపుతున్నారు. భారత్‌కి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు విదేశాల్లో ఆందోళనా కార్యక్రమాలను, నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్న సంగతి ప్రభుత్వం దృష్టికి వచ్చిందనీ, ఆయా దేశాలతో గల ద్వైపాక్షిక సం బంధాలను అనుసరించి అవి భారత్‌ దృష్టికి తీసుకుని రావల్సి ఉందని మోడీ అన్నారు. ఇతర దేశాలకు వ్యతి రేకంగా భారత్‌లో అటువంటి కార్య కలాపాలు జరిగితే తమ ప్రభుత్వం వెంటనే ఆయా ప్రభు త్వాలకు తెలి యజేస్తున్న సంగతిని గుర్తు చేశారు.

నిఖిల్‌ గుప్తాపై నిర్ది ష్టమైన ఆరోపణలు ఉంటే తప్పక చర్యలు తీసుకుం టామని అన్నారు. అయితే, అతడు ఒక చోట స్థిరంగా ఉండకుండా పలు దేశాలకు మకాం మారు స్తున్నాడు. ఇ లాంటి వారి జాబితా చాలా పెద్దదే ఉంది. వీరిని కనుగొన డంలో అగ్రరాజ్యమైన అమెరికా భారత్‌కి స హకరిం చాల్సింది పోయి భారత్‌పై అభాండాలను సమ ర్థించడం సరైంది కాదు. ఖలిస్తాన్‌ ఉగ్రవాది చాలా పెద్ద ప్రకటనలే చేశాడు. భారత పార్లమెంటుపై దాడి చేస్తామని తేదీతో సహా ప్రకటన విడుదల చేశారు. సరిగ్గా ఆరోజునే భారత పార్లమెంటులోకి అగంతకులు ప్రవేశించారు. ఇలాంటి విషయాలపై స్పందించాల్సిన బాధ్యత అగ్ర రాజ్యంపై ఉంది. అసలు ఖలిస్తాన్‌ అనే వేర్పాటువాద సం స్థకు ఆశ్రయం ఇస్తున్న కెనడాపై అమెరికా ఇంతవరకూ పల్లెత్తు మాట అనకపోవడం దురదృష్టకరం. అమెరికా తన వద్ద ఉన్న సమాచారాన్ని భారత్‌కి అందజేసి నిఖిల్‌ గుప్తాపై ఆరోపణలు నిజమైనవో కావో నిగ్గు తేల్చేందుకు సహకరించాలి. అమెరికా మన దేశంతో ద్వైపాక్షిక సం బంధాలను కొనసాగిస్తూనే ఉక్రెయిన్‌పై రష్యా దాడి విష యంలో తటస్థ వైఖరిని విడనాడాలంటూ ఒత్తిడి చేసిన విషయాన్ని మరిచి పోరాదు. భారత వైఖరి అం దరి ప్రశంసలు అందుకోవడం చూసి అమెరికా ఓర్వలే కపోయింది. తాజా ఆరోపణల వెనుక కూడా భారత్‌పై అమెరికా అసూయ వెల్లడవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement