రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ళ క్రితం రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వ చర్య రాజ్యాంగ సమ్మతమేనని సోమవారం నాడు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సుస్పష్టం. ఎటువంటి సందే హాలకు తావివ్వని విధంగా తీర్పు ఉంది. మోడీ ప్రభుత్వ కీర్తి కిరీటంలో ఓ కలికి తురాయిగా 370 అధికరణం రద్దు నిర్ణయం నిలుస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఈ అధికరణం దేశ ప్రజల పట్ల వివక్షకు సంకేతమని బీజేపీ, దాని మాతృక అయిన భారతీయ జనసంఘ్ మొదటి నుంచి వాదిస్తు న్నాయి. ఏ దేశంలోనూ ఇద్దరు ప్రధానులు ఉండరు. రెండు రాజ్యాంగాలు, రెండు పతాకాలు ఉండవు. ఒక్క కాశ్మీర్‌కి మాత్రమే ఎందుకు ఈ ప్రత్యేకత? అలాగే, పార్లమెంటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా రూపొందించే చట్టాలు కాశీ ్మర్‌కి వర్తించవు. దేశంలో ఏప్రాంతంలోనైనా జీవించే హక్కు, వృత్తి వ్యాపారాలు చేసుకునే హక్కు, ఆస్తులను సంపాదించు కునే హక్కు దేశ ప్రజలందరికీ సమానమైనప్పుడు ఆ హక్కులు కాశ్మీర్‌లో ఎందుకు చెల్లుబాటు కావు అనే ప్రశ్నలతో బీజేపీ దశాబ్దాలుగా ప్రశ్నిస్తోంది. ఈ వివక్షకు వ్యతిరేకంగా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్‌లోనే పోరాడారు.
అక్కడి జైలులో ని ర్బంధంలో ఉన్నప్పుడు అనుమానా స్పద స్థితిలో మరణించారు. ఆయన ఆత్మబలిదానాన్ని భారతీయ జనసంఘ్, బీజేపీలు రాజకీయ అస్త్రంగా తీసుకుని దశాబ్దాలుగా పోరాటాలు సాగిస్తోంది. బీజేపీ అజెండాలో 370 అధికరణం రద్దు ప్రధానాంశం. తాము అధికారంలోకి వస్తే ఆ అధికరణాన్ని రద్దు చేస్తామన్న వాగ్దానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిలబెట్టుకు న్నారు. 2019 ఆగస్టు 19వ తేదీన 370వ అధికరణం రద్దును పార్లమెంటు రద్దు చేసింది. జమ్ము- కాశ్మీర్ భారత్‌లో విలీనం అయిన తర్వాత ఆ రాష్ట్రానికి సార్వభౌ మాధికారం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాక, దేశంలో ఏ పౌరుడైనా రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా కాశ్మీర్‌లో కూడా ఆస్తులు సంపాదించు కోవచ్చనీ, వ్యాపారాలు చేసుకోవ చ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హక్కుల విషయంలో కాశ్మీర్‌కి ప్రత్యేకత ఏమీ లేదనీ, స్వాతం త్య్రం వచ్చిన కొత్తలో 370వ అధికరణం ద్వారా ప్రత్యేక హక్కులు ఇచ్చారంటే అది తాత్కాలికమైన ఏర్పాటు మాత్రమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కాశ్మీర్ నుంచి లడఖ్‌ని విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగానూ, జమ్ము -కాశ్మీర్‌ని అసెంబ్లిdతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా నూ మోడీ ప్రభుత్వం ప్రకటించడాన్ని కూడా సుప్రీం కోర్టు సమర్థించింది. కాశ్మీర్‌కి వీలైనంత త్వరగా రాష్ట్ర హోదాని ప్రకటించాలనీ, 2024 సెప్టెంబర్ 30వ తేదీలో గా అసెంబ్లిd ఎన్నికలు నిర్వహించాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు పట్ల ప్రధానమంత్రి నరేం ద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ ఇతర నాయ కులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో మూడింటిని బీజేపీ కైవసం చేసుకోవడం, ఇప్పుడు కాశ్మీర్‌పై న్యాయపోరాటంలో విజయం సాధిం చడంతో కమలనాథుల్లో జోష్ పెరిగింది. వచ్చే ఏడాదిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి ఈ పరిణామం దోహదం చేస్తుందని వారు ఆశిస్తున్నారు. మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం పార్టీ అజెండా లో ఇప్పటికే ప్రధానమైన అయోధ్యలో రామాలయం నిర్మాణం, త్రిపుల్ తలాక్ రద్దు, కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి ని కల్పించే 370వ అధికరణం రద్దు వంటి అంశాలను అమలు జేసిందనీ, దేశ ఆర్థిక వ్యవస్థను శరవేగంగా అభివృద్ధి పరుస్తున్న మోడీ అంతర్జాతీయంగా భారత్ కీర్తి చంద్రికలను నలుదిశలా వ్యాపింపజేస్తున్నారంటూ కమలనాథులు ఉత్సాహపూరితంగా ప్రకటిస్తున్నారు.
ప్రధానమంత్రి మోడీ స్వయంగా సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తంచేస్తూ, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ప్రజలకు తమ ప్రభుత్వం జవాబుదారీగా ఉంటూ కీలకమైన నిర్ణయాలను తీసుకుంటోందనీ, ఇందుకు న్యాయస్థానాల మద్దతు కూడా లభించడం హర్షించదగిన విషయమని అన్నారు. కాగా, కాశ్మీర్‌లో 1980 నుంచి జరుగుతున్న మానవ హక్కుల ఉల్లం ఘనపై విచారణకు ఒక కమిషన్‌ని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీ య స్థాయిలో లేవనెత్తేందుకు పొరుగున ఉన్న పాకిస్తాన్ కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందం టూ పదే పదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా కూడా ఈ విషయంలో శృతి కల్పడం దురదృష్టకరం. ఈ విషయమై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కమిషన్ విచారణ సరైన మార్గమే. ఈ తీర్పును మోడీ ఓ ఆశాకిర ణంగా అభివర్ణించారు. భారతీయులుగా మనమంతా గర్వపడే ఐక్యతను సుప్రీంకోర్టు మరోసారి బలపర్చింది. భారత్ అంతా ఒక్కటేనని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.