Friday, November 22, 2024

TG: అజారుద్దీన్‌కు ఈడీ స‌మన్లు..

మనీ లాండ‌రింగ్ కేసులో నేడు విచార‌ణ‌
రూ.20కోట్ల దుర్వినియోగంపై ఆరోప‌ణ‌లు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : మనీలాండరింగ్ కేసులో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు ​​జారీ చేసింది. రూ.20 కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వ‌చ్చిన సంగ‌తి విదిత‌మే. ఈ రోజే హైదరాబాద్‌ లోని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

ఇవీ ఆరోప‌ణ‌లు…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఉండేవారు. ఆయ‌న‌ హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉప్పల్‌ లోని రాజీవ్‌గాంధీ క్రికెట్ స్టేడియంలో డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక వ్యవస్థలు, పందిరి కొనుగోళ్ల‌ కోసం కేటాయించిన రూ.20 కోట్లను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement