హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ పంజాగుట్టలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ట్రాయ్ డైరెక్టర్ ఇంటిపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. ట్రాన్స్ట్రాయ్ డైరెక్టర్గా ఉన్న మాలినేని సాంబశివరావు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలున్నాయి. దీంతో ఇవ్వాల (మంగళవారం) ఉదయం నుంచి ఆయన ఇళ్లు, ఆపీసులపై ఏకకాలంలో ఈడీ సోదాలు జరుపుతోంది.
దాదాపు 15 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ట్రాన్స్టాయ్ పవర్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ట్రాయ్ రోడ్డు ప్రాజెక్టులకు మాలినేని సాంబశివరావు డైరెక్టర్గా ఉన్నారు.