రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై స్పందించారు. ఇది కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యేనని పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందన్నారు. కేంద్ర విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని చెప్పారు. కేంద్రం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడమన్నారు. మరింతగా పోరాడుతామని సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇలాంటి కక్షపూరిత చర్యలు బీజేపీ పతనానికి నాంది అని మంత్రి పేర్కొన్నారు. దేశమంతా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఒక మహిళ పట్ల ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గపు చర్య అని ఆమె మండిపడ్డారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement