ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం సంభవించింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు మరోసారి జారీ చేసింది. ఈ కేసులో గత ఏడాది మార్చి నెలలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. తాజాగా మరోసారి నోటీసులు పంపించింది. రేపు ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఉండగా ఈడీ నోటీసులపై కవిత ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
హాజరు కాలేను – కవిత
ఈడీ విచారణకు హాజరు కాకూడదని కవిత నిర్ణయించుకున్నట్లు సమాచారం.. ఇప్పటికీ ఈడి నోటీస్ రద్దు చేయాలని సుప్రీం కోర్టు లో వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్న విషయం కవిత గుర్తు చేశారు