హైదరాబాద్, : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణకు హాజరుకానున్నారు.
ఈనెల 7న మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు..16న తమ విచారణకు హాజరుకావాలని కోరారు. దీంతో గురువారం ఉదయం 10 గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి, 10.30 గంటలకు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకుంటారు.