ఢిల్లీ – లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా పొలిటికల్‌గా పెను ప్రకంపనలు సృష్టించింది. తాజాగా ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో తాను 11వ తేదీన విచారణకు హాజరు కానున్నట్టు ఈడీని కోరుతూ బుధవారం లేఖ రాశారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా, ముందస్తు అపాయింట్మెంట్లు, వేర్వేరు కార్యక్రమాల కారణంగా ఇవాళ విచారణకు హాజరుకాలేనని లేఖలో అభ్యర్థించారు. అయితే, కవిత విన్నపానికి ఈడీ స్పందించింది.
కవిత లేఖపై గురువారం స్పందించిన ఈడీ.. కవిత విన్నపానికి ఓకే చెప్పింది. 11వ తేదీన (శనివారం) విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. దీంతో, ఈడీ విచారణపై ఉత్కంఠకు తెరపడినట్లయింది. ఈడీ పర్మీషన్ ఇచ్చిన నేపథ్యంలో రేపు యదావిథిగా జంతర్‌మంతర్ దగ్గర కవిత దీక్ష కొనసాగనుంది. ఇదిలా ఉండే.. ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రెస్మీట్లో మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరగనుంది..
ఎమ్మెల్సీ కవిత ఈడికి లేఖ
తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నాడు ఆమె ఈడి జాయింట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ముందస్తు అపాయింట్మెంట్లు మరియు కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేయని తేల్చి చెప్పారు.హడావిడిగా దర్యాప్తు చేయడం ఏంటని ఈడిని కవిత నిలదీశారు. ఇంత స్వల్ప కాలంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం ఏంటో అర్థం కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు పేరిట రాజకీయo చేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ప్రస్తుత దర్యాప్తుతో తాను చేసేది ఏమీ లేదని తెలిపారు. ఒక సామాజిక కార్యకర్తగా ఒక వారం ముందే నా కార్యక్రమాలు ఖరారయ్యాయనీ, కాబట్టి 11వ తేదీన విచారణకు హాజరవుతానని తెలియజేశారు.
రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు.దేశ పౌరురాలిగా ఒక మహిళగా చట్టపరమైనటువంటి అన్ని హక్కులను తాను ఉపయోగించుకుంటానని తేల్చి చెప్పారు.గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఒక మహిళను తన నివాసంలో విచారించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. వీటన్నింటినీ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని అడిగారు.