Thursday, October 3, 2024

TG: చేప‌ల పెంప‌కంతో మ‌త్స్యకారుల ఆర్థిక అభివృద్ధి.. మంత్రి పొన్నం..

లోయ‌ర్ మానేరులో చేప పిల్ల‌ల విడుద‌ల‌
మ‌త్స్య ఉత్ప‌త్తిలో క‌రీంన‌గ‌ర్ అగ్ర‌స్థానం
కుల వృత్తిదారుల సంక్షేమ‌మే సీఎం ధ్యేయం
హుస్నాబాద్‌లో అన్ని చెరువుల్లో చేప‌ల పెంప‌కం
రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, క‌రీంన‌గ‌ర్ : చేప‌ల పెంప‌కంతోనే మ‌త్స్య‌కారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతార‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. గురువారం ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అధ్యక్షతన లోయర్ మానేరు డ్యాంలో చేప పిల్లలను విడుదల చేశారు. తొలుత గంగ‌మ్మ త‌ల్లికి మంత్రి పొన్నం పూజ‌లు చేసి చేప పిల్ల‌ల‌ను విడుద‌ల చేశారు. చేప పిల్లలు ఎంత ఉత్పత్తి జరిగితే అంతమేర మ‌త్స్య‌కారుల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంద‌ని, త‌ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతార‌న్నారు.

కుల వృత్తిదారుల సంక్షేమమే సీఎం ధ్యేయం…
కుల వృత్తిదారుల సంక్షేమమే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయ‌మ‌ని మంత్రి పొన్నం అన్నారు. సీఎం కృషి వ‌ల్ల చేప పిల్ల‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌ని చెప్పారు. మానేరులో 30లక్షల చేప పిల్లలు కాదు 60లక్షల చేప పిల్లల కేపసిటీ ఉందన్నారు. ఈ ప్రాంతంలో చేప పిల్లల ఉత్పత్తి లో కరీంనగర్ ఉత్తర తెలంగాణ లోనే పెద్దదన్నారు. హుస్నాబాద్ లో అన్ని చెరువుల్లో కూడా చేప పిల్లలు పంపిణీ కి మూడు జిల్లాల అధికారులతో మాట్లాడి ఉపాధి కల్పించేలా చేస్తున్నామన్నారు.

- Advertisement -

కోల్డ్ స్టోరేజీలు పెట్టుకుంటామంటే రాయితీ రుణాలు..
చేప పిల్లల ఉత్పత్తి చేసి ఉపాధి పెంచుకునే వారికి అండగా ఉంటామని, కోల్డ్ స్టోరేజ్ లు పెట్టుకుంటామంటే సబ్సిడీ ద్వారా రుణాలు ఇస్తామ‌ని మంత్రి పొన్నం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఫిష్ ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ సునీల్ రావు, ఫిషరీస్ కమిషనర్ ప్రియాంక ఆలా, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement