Saturday, November 23, 2024

ఆర్థిక క‌ష్టాల్లో తెలంగాణ స‌ర్కార్

హైదరాబాద్‌, : పెరిగిన ఖర్చులు, పూర్తిగా ఆగిన రాబడితో ఆర్ధిక శాఖ కుస్తీ పడుతోంది. రానున్న ఖర్చులను అంచనా వేసుకుని అవసరాలను అంచనా వేసుకుంటోంది. ముందస్తు ఆలోచనలతో మేలుకున్నప్పటికీ కరోనా ప్రభావం నియంత్రణలోకి రానిపక్షంలో జూన్‌ నెలలో ఎలా నెట్టుకు రావా లనే కోణంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెలలో అన్ని రాబడులు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. రాబడి శాఖలు పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉండిపోయాయి. అప్పులు, బాండ్ల విక్ర య ఆదాయం మినహా ఖజానాకు రాబడి లేకుండా పోతోంది. ఈ నెలలో పూర్తిగా రాబడిపై ప్రభుత్వం ఆశలు వదులుకుంది. కరోనాతో పెరిగిన ఖర్చులకు దీటుగా ఎటువంటి ఆర్ధిక వన రులు సర్కార్‌కు అందడంలేదు. ఈ నేపథ్యంలో ఆర్ధిక సర్దుబా టుపై ఆర్ధిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రావాల్సిన రూ. 5వేల కోట్లు ఉండగా ఈ నెలలో పెట్రో ఉత్పత్తులు నిల్చిపోయే ప్రమాదకర పరిస్థితితోపాటు ఇతర వినియోగ వస్తువుల కొనుగోళ్లు మందగించడంతో రాబడి 10శాతంలోపుగానే ఉంది. మద్యం ఆదాయం కొంతమేర ఆశాజనకంగా ఉండగా, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు ఈనెల 22వరకు తెరచుకునే అవకాశాలు లేవు. ధరణిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర క్రయవిక్రయాల లావాదేవీలు పూర్తిగా నిల్చిపో యాయి. ఈ శాఖద్వారా వచ్చే రూ. 900కోట్లు పూర్తిగా కరు వయ్యాయి. రవాణా శాఖ ద్వారా సమకూరే రూ. 350కోట్లలో ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. కాగా ఈనెల వేతనాలు రూ. 3500కోట్లు, ఆసరా పించన్లు రూ. 1000కోట్లు, ఇతర నిర్వహణ వ్యయాలు, కరోనా కట్టడికి ప్రత్యేక వ్యయాలు, ఖర్చులు వంటివన్నీ కలుపుకుని దాదాపు రూ. 12వెల కోట్లు తక్షణం కావాల్సి ఉంది. గత వారం బాండ్ల విక్ర యాలతో రూ. 2వేలు కోట్లు సమకూర్చుకోగా, ప్రభుత్వ ఖజా నాలో మరో రూ. 900కోట్లు ఉండగా, ప్రభుత్వ శాఖలనుంచి రూ. 2వేల కోట్లు వారి ఖాతాలనుంచి వస్తాయనే ఆశతో ప్రభుత్వం ఉంది.
ఈ నెలాఖరుకు రూ. 12వేల కోట్లు కావాల్సిందే…
ఈ నెలాఖరుకు వేతనాలు, పించన్లకు రూ. 3500కోట్లు, వడ్డీల చెల్లింపులకు రూ. 1150 కోట్లు, రుణాల రీ పేమెంట్‌కు రూ. 1300 కోట్లు, ఆసరా పించన్లకు రూ. 1000 కోట్లు, స్థానిక సంస్థలకు ప్రతీనెలా ఇస్తామని చెప్పిన రూ. 500కోట్లు తక్షణం కావాల్సి ఉంది. ఇక ఉచిత బియ్యం కోసం రూ. 1120కోట్లు, ఇతర వైద్య ఖర్చులకు, వైద్య పరికరాలకు, ఉద్యోగుల ప్రోత్సాహకాలకు భారీ మొత్తం సమీకరించుకోవాల్సి ఉంది. పన్ను రాబడులు పూర్తిగా స్థంభించిపోవడం, కేంద్రం నుంచి ఎటువంటి ఆర్ధిక సాయం అందే అవకాశాలు మృగ్యం కావడంతో నిధుల సమీక రణకు దృష్టిసారించింది. మరోసారి బాండ్ల విక్ర యంతో రూ. 1000 కోట్లు, కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా రూ. 1400కోట్లను సమీకరించేందుకు ఆర్ధిక శాఖ చర్యలు ఆరంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement