తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తనను ఓడగొట్టే దమ్ములేక కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తారని విమర్శించారు. తన రాజీనామా తర్వాతనే కేసీఆర్ దళితులకు గౌరవం ఇస్తున్నారని అన్నారు. దళిత బిడ్డలను ఏసీ బస్సుల్లో ఎస్కార్ట్ పెట్టి ప్రగతిభవన్‌కు తీసుకువెళ్లారని చెప్పారు. మాజీ ఐపీఎస్ అర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించారని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థను కేసీఆర్ బోన్‌లో నిలబెట్టాడని ఈటల విమర్శించారు.
ఇది కూడా చదవండి: ఈటల వల్లే దళిత బంధు: ఈటల జమున