Friday, November 22, 2024

TS | సంగారెడ్డి జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం

హదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పది రోజుల వ్యవధిలో భూకంపం రెండు సార్లు రావడంతో జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. జిల్లాలోని న్యాల్కల్‌ మండలంలో గత నెల 27న భూకంపం రాగా.. మంగళవారం పలు చోట్ల భూమి కంపించింది.

ఐదు సెకన్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపిచిందని ప్రజలు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు. పది రోజుల వ్యవధిలో రెండుసార్లు భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఇంతకుముందు.. న్యాల్కల్‌ మండలంలోని న్యాల్కల్‌, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. కాగా.. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కానీ.. జిల్లాలో భూకంపం అనగానే ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement