వరంగల్ / నల్గొండ ఆంధ్రప్రభ : ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ బుధవారం ఉదయం 7.35 సమయంలో రెండు సెంకడ్ల పాటు భూ ప్రకంకనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని సామగ్రి కదదడంతో ఏమి జరగుుతుందో తెలియక జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లోని పలు చోట్ల స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బయ్యారం మండల కేంద్రంలో మరికొన్ని ప్రాంతాల్లో భూకంపం. 7గంటల 10 నిమిషాలకు సంఘటన జరిగింది. కోడిపుంజు తండాలో ఇళ్లలోని సామానులు చిందర వందర గాపడిపోయాయి. కొన్ని ఇల్లగోడలకు పగుళ్లు వచ్చాయి.కొద్దిసేపు భయంగుప్పిట్లో ప్రజలు. ఆందోళనకు గురయ్యారు..
తిరుమలగిరిలోనూ..
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో బుధవారం ఉదయం స్వల్ప భూకంపం సుమారు మూడు సెకండ్లలో వచ్చింది. మంచాలు, కంచాలు కదిలినాయి. ప్రజలు ఆందోళన చెందారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు చోట్ల భూమి కంపించింది.
భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై5.3 పాయింట్లు గా నమోదు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూకంపం రిక్టర్ స్కేల్ పై5.3 ఐదు పాయింట్ మూడు సెకండ్లు భూమి కల్పించినట్లు అధికారికంగా సమాచారం. తెలంగాణ రాష్ట్ర మొత్తానికి ములుగు జిల్లా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఏపీ సెంటర్ నివేదికను పరిశీలించగా భూమి లోపల 40 కిలోమీటర్ల నుండి ఈ రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు తెలియజేశారు
మణుగూరులో….
మణుగూరులో. కొన్ని సెకండ్ల పాటు భూకంపనలు సంభవించాయి. దీంతోఒక్కసారిగా ఉలికిపడ్డ మణుగూరు ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.