హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎంసెట్ ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ కోసం 30,125 సీట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయని అధికారులు ప్రకటించారు. మొత్తం 82,666 సీట్లు ఉంటే అందులో మొదటి విడతలో 70,665 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. ఈ 70,665 మందిలో ఇప్పటి వరకు 52,541 మంది విద్యార్థులు మాత్రమే కళాశాలలకు వెళ్లి రిపోర్టింగ్ చేశారు. అంటే ఇంకా 30,125 సీట్లు మిగిలే ఉన్నాయి. వీటిని రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లో భర్తీ అయిన సీట్లు పోనూ ఇంకా 16,009 సీట్లు మిగిలే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సుల్లో 7528 సీట్లు, సివిల్, మెకానికల్ కోర్సుల్లో 5876 సీట్లు, ఇతర ఇంజనీరింగ్ కోర్సుల్లో 712 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement