Wednesday, January 8, 2025

e – Formula Race Case ఈ డీ అధికారులకు కేటీఆర్ లేఖ

హైదరాబాద్ – ఈ ఫార్ములా కారు రేసు కేసులో రేపు విచారణకు హాజరుకావల్సి ఉన్న నేపథ్యం లో వాయిదా కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ డీ కి లేఖ రాశారు .

హైకోర్టు తీర్పును వెలువరించేంతవరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ కోరారు. రేపు ఈడీ విచారణకు హాజరు కాలేనని పేర్కొన్నారు . కాగా, వారంరోజుల క్రితం ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 7న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌కు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3న విచారణకు రావాలని అరవింద్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే అనూహ్యంగా అధికారులు ఇద్దరు విచారణకు హాజరు కాలేదు. దీంతో వారికి మరోసారి నోటీస్ లు జారీ చేసారు ఈ డీ అధికారులు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement